2019లో ఇంగ్లండ్ వేదికగా జరుగనున్నవన్డే ప్రపంచకప్‌కు ఆడే పది జట్లు ఫైనల్ అయ్యాయి. గతేడాది సెప్టెంబరులో ఐసీసీ ప్రకంటించిన వన్డే ర్యాంకింగ్స్ ఆధారంగా ఎనిమిది జట్లు నేరుగా ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. వాటిలో ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. ఇక మిగతా రెండు జట్ల కోసం నిర్వహించిన ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచ్‌లు ఆడిన జట్లలో వెస్టిండీస్, ఆఫ్ఘనిస్థాన్‌లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి.
ప్రపంచకప్ క్వాలిఫయర్స్ మ్యాచుల్లో సూపర్ సిక్స్‌లో స్కాట్లాండ్‌ను ఓడించడం ద్వారా వెస్టిండీస్‌కు ప్రపంచకప్‌కు అర్హత సాధించగా.. తొలి మూడు మ్యాచుల్లోనూ ఓడిపోతూ వస్తున్న ఆఫ్ఘనిస్థాన్ జట్టు ఆ తరువాత పుంజుకుంది. యువ స్పిన్నర్ రషీద్ ఖాన్ అద్భుత బౌలింగ్‌తో సూపర్ సిక్స్‌లో ఐర్లండ్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కాగా ఈసారి ప్రపంచకప్‌లో గ్రూపులు ఉండవు. పది జట్లు కలిసి ఒకే గ్రూపుగా ఉండనుండగా.. ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఆడనుంది. అందులో టాప్ ఫోర్ జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. 30 మే 2019న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.