నన్ను పెళ్లి చేసుకోవా ప్లీజ్

528
funny proposal to raai laxmi

హీరోహీరోయిన్లకు అభిమానుల నుంచి ప్రపోజల్స్ రావడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఇక సోషల్ మీడియా పుణ్యమా అని.. అందులోనే డైరక్ట్‌గా వారికి ప్రపోజల్‌ను పంపిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీకి వినూత్నంగా మ్యారేజ్ ప్రపోజల్‌ను చేశాడు ఓ నెటిజన్.



 

“నాకు ఐదు ఎకరాల పొలం, ఒక అందమైన ఇళ్లు, ఒక స్కూటర్, మీ మీద ఎప్పటికీ చెరిగిపోని ప్రేమ ఉంది. నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్” అంటూ ఓ నెటిజన్‌.. రాయ్ లక్ష్మీకి ప్రపోజల్ చేశాడు. దానికి స్పందించిన రాయ్ లక్ష్మీ.. “నీ ప్రపోజల్‌కు థ్యాంక్స్. కానీ ఇప్పట్లో నాకు పెళ్లి ఆలోచనలు లేవు. అందమైన అమ్మాయి నీకు దొరకాలని భావిస్తున్నా” అని రిప్లై ఇచ్చింది.