నేడే రాములోరి పెళ్లి

425
today seetha rama marriage

భద్రాచలం: భద్రాద్రి రాముని కల్యాణ ఘడియలు రానే వచ్చాయి. జగ దానంద తారకుడైన జానకీరాముడి కల్యాణోత్సవానికి భద్రగిరి ముస్తాబైంది. సోమవారం శ్రీసీ తారాముల కల్యాణం జరగనుంది. మంగళవారం శ్రీరామ పట్టాభి షేకం వేడుకలు జరగనున్నాయి. వేడుకల నిర్వహణకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. విళంబినామ సంవత్సరంలో ఈ ఏడాది ఈ ప్రధాన వేడుకలు జరగనున్న నేపథ్యంలో 60 ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ మంచి ముహూర్తం రోజు కల్యాణం, పట్టాభిషేకం వేడుకలు కనులారా చూడాలనే తపనతో దేశ నలుమూలల నుంచి భక్తులు భద్రాద్రికి చేరుకుంటున్నారు.



 

రామాలయానికి రంగులు వేసి విద్యుదీలంకరణ గావించడంతో ఆలయ పరిసరాలు మిరిమిట్లు గొలుపుతున్నాయి. స్వామివారి కల్యాణం నిర్వహించే మిథిలా ప్రాంగణం ముస్తాబైంది.చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. చాందినీ వస్త్రాలతో అందంగా అలంకరించారు. కల్యాణ మండపాన్ని రంగులతో తీర్చిదిద్దారు. మిథిలా ప్రాంగణంలో కూలర్లు, ఏసీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని మిథిలా ప్రాంగణం బయట బ్రిడ్జి సెంటర్, గోపాలకృష్ణ సినిమా హాల్ సెంటర్ వరకు సైతం షామియానాలు ఏర్పాటు చేశారు. భక్తులకు తాత్కాలిక మరుగుదొడ్లు, వసతిగ హాలు ఏర్పాటు, తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. కరకట్ట ప్రాంతాన్ని అందంగా తీర్చిదిద్దారు. గోదావరి తీరంలో సైతం షామియానాలు ఏర్పాటు చేశారు. లడ్డూ ప్రసాదాలు సిద్ధం చేశారు.
srirama navami

జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంత్ భద్రాచలంలో మకాం పెట్టి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భద్రాచలం సబ్‌కలెక్టర్ పమేల సత్పతి కల్యాణ ఏర్పాట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఈ వేడుకలు సీఎం కేసీఆర్ వస్తారా? రారా? అన్న అంశంపై మీమాంస నెలకొంది. సీఎం కేసీఆర్ రాకుంటే.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి దంపతులు ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు సమర్పించే అవకాశాలు ఉన్నాయి.