“జస్టిస్ లీగ్” ట్రైలర్… మునుపెన్నడూ లేని విధంగా జోకర్…!

204
Zack Snyder’s Justice League Trailer

సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందులో “జస్టిస్ లీగ్” కూడా ఒకటి.

భారీ ప్రేక్షకాదరణను దక్కించుకున్న “జస్టిస్ లీగ్” నుంచి తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు.

జాక్ స్నైడర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ “జస్టిస్ లీగ్” ట్రైలర్ మొదట్లో సూపర్ మ్యాన్ (హెన్రీ కావిల్) అంతిమ త్యాగం ఫలించలేదని నిర్ధారించడానికి… బ్రూస్ వేన్ (బెన్ అఫ్లెక్) డయానా ప్రిన్స్ (గాల్ గాడోట్)తో దళాలను సమం చేస్తాడు.

ఈ ట్రైలర్ లో బ్యాట్ మ్యాన్ (అఫ్లెక్), వండర్ వుమన్ (గాడోట్), ఆక్వామన్ (జాసన్ మోమోవా), సైబోర్గ్ (రే ఫిషర్), ది ఫ్లాష్ (ఎజ్రా మిల్లెర్) అందరూ ఉన్నారు.

అంతేకాకుండా ట్రైలర్ చివరిలో జోకర్ పవర్ ఫుల్ డైలాగ్ చెప్తూ కనిపిస్తాడు. ఇందులో జోకర్ మునుపెన్నడూ లేనట్టుగా కొత్తగా కనిపించాడు.

ఈ ట్రైలర్‌లో డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను రెట్టింపు చేస్తున్నాయి.

ఈ సినిమా మార్చి18న రానుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.