ఆధునిక జీవనశైలి, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, తీవ్ర మానసిక ఒత్తిడి, సరిగా నిద్రపట్టకపోవడం…
లాంటి కారణాలతో మనల్ని అసౌకర్యానికి గురిచేసే జీర్ణకోశ వ్యవస్థకు సంబంధించిన అనేక రకాల సమస్యల్లో గ్యాస్ ట్రబుల్ ఒకటి.
గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులో ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన జరుగుతుంది.
పుల్లటి తేన్పులు, ఛాతిలో మంట వంటి లక్షణాలు ఇబ్బంది పెడతాయి.
సరైన అవగాహన ఉంటే ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోగలం.
ఈ సమస్య కు పరిష్కారం లభించాలంటే కొన్ని చిట్కాలను పాటిస్తే మంచిది.
- రోజూ ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగండి.
- ఎసిడిటీతో బాధపడేవారికి కొబ్బరి నీళ్లు మంచి ఉపశమనం కలిగిస్తాయి.
- ఉదయాన్నే అల్లం ముక్కను నమలండి లేదా ఒక కప్పు అల్లం టీ తాగండి.
- పచ్చళ్లు, ఊరగాయలు, వెనిగర్‌లకు దూరంగా ఉండండి.
- ఉదయాన్నే ఖాళీ కడుపున పుదీనా ఆకులను నమలండి.
- బెల్లం, నిమ్మ, అరటి, పెరుగు ఎసిడిటీ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి.
- క్యారట్, వెల్లుల్లి, మునగకాయలు, బీన్స్, గుమ్మడికాయ, క్యాబేజీ వంటివి ఎసిడిటీ సమస్యను తగ్గిస్తాయి.
- లవంగాల వల్ల జీర్ణక్రియ మెరుగుపడి ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.