యువరాజ్ సింగ్ పై ఎఫ్ఐఆర్ నమోదు

284
FIR registered against Yuvraj Singh

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ వివాదాల్లో చిక్కుకున్నాడు. యువరాజ్ పై హర్యానా హిసార్ లోని హన్సి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది.

ఎస్సీ, ఎస్టీ యాక్ట్ తో పాటు, ఐపీసీలోని పలు సెక్షన్ల కింద హర్యానా పోలీసులు కేసును రిజిస్టర్ చేశారు.

2020 జూన్ లో భారత ఓపెనర్ రోహిత్ శర్మతో కలిసి ఇన్స్ స్టాగ్రామ్ లైవ్ చాటింగ్ లో ఓ వర్గానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడు.

ఆ సమయంలో ఓ సామాజిక వర్గం గురించి కొన్ని వ్యాఖ్యలు చేయగా, యువరాజ్ పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అనంతరం ఓ న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు.

విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు కేసు నమోదు చేశారు. యువరాజ్ పై  153, 153 ఏ, 295, 505 సెక్షన్లతో పాటు ఎస్సీ, ఎస్టీ యాక్ట్ లోని 3 (1) (ఆర్), 3 (1) (ఎస్) కింద కేసు పెట్టినట్టు అధికారులు వెల్లడించారు.

తన వ్యాఖ్యల గురించి యువరాజ్ గతంలోనే వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని వెల్లడించారు.

తన మాటల వల్ల ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా క్షమించాలని కోరుతూ ట్విట్టర్ లో ఓ సందేశాన్ని ఉంచారు.

ఒక భారతీయుడిగా ఎవరి మనోభావాలనైనా కించపరిచినట్లయితే అందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.