వసూళ్ల “ఉప్పెన”… మూడు రోజుల్లోనే లాభాలు…!

157
Uppena First Day Collections

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన “ఉప్పెన” చిత్రం ఫిబ్రవరి 12న విడుదలై అంచనాలను అందుకుంది. తొలి రోజు పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లు రాబట్టింది. థియేటర్స్‌లో 100 శాతం ఆక్యుపెన్సీతో విడుదలైంది ఉప్పెన.

ఫస్ట్ డే ఉప్పెన చిత్రానికి నైజాం, తెలంగాణలలో కలిపి వరల్డ్ వైడ్‌గా రూ.10.42 కోట్ల షేర్ రాబట్టింది. తొలి రోజు రికార్డ్ కలెక్షన్లు రాబట్టడంతో వైష్ణవ్ తేజ్ డెబ్యూ హీరోగా తొలిరోజు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హీరోగా రికార్డుల కెక్కాడు.

తొలి మూడు రోజుల్లో ‘ఉప్పెన’ ప్రపంచ వ్యాప్తంగా రూ.28.29 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్‌ (రూ. 22.5 కోట్లు)ను దాటేసి లాభాలు కూడా అందుకుంది ‘ఉప్పెన’.

మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ‘ఉప్పెన’ వసూళ్లు :
నైజాం – రూ. 8.53 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 4.12 కోట్లు
సీడెడ్ – రూ. 3.7 కోట్లు
తూర్పు గోదావరి – రూ. 2.36 కోట్లు
పశ్చిమ గోదావరి – రూ. 1.53 కోట్లు
కృష్ణా – రూ. 1.76 కోట్లు
గుంటూరు – రూ. 2.07 కోట్లు
నెల్లూరు – రూ. 86.4 లక్షలు
ఏపీ, తెలంగాణ మొత్తం: రూ. 24.97 కోట్లు
ఓవర్సీస్ – రూ. 1.2 కోట్లు
కర్ణాటక – రూ. 1.31 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – రూ. 33 లక్షలు
మొత్తం : రూ. 28.29 కోట్లు