
గుజరాత్ సీఎం విజయ్ రూపాని వేదికపై ప్రసంగిస్తూ ఒక్కసారిగా కుప్పకూలిన సంగతి తెలిసిందే.
పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వడోదరాలో ఓ సభలో మాట్లాడుతుండగా స్పృహ కోల్పోయాడు.
ఈ నేపథ్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా సీఎం విజయ్ రూపానీకి కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది.
అస్వస్థతతో ఉన్నప్పటికీ వరుస ప్రచారలతో అలిసోయి సొమ్మసిల్లి పడిపోయారని బీజేపీ శ్రేణులు తొలుత వెల్లడించాయి.
వేదికపై స్పృహ కోల్పోయిన ఆయనను హుటాహుటీన హెలికాప్టర్ ద్వారా అహ్మదాబాద్ లోని ఓ ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్టు తేలింది. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రూపానీ కరోనా బారినపడినట్టు ఆసుపత్రి బులెటిన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు.