
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమార్తె హర్షిత కేజ్రీవాల్ ను మోసం చేసిన ముగ్గురు కేటుగాళ్లను అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
మోసానికి పాల్పడ్డ సాజిద్, కపిల్, మన్వేంద్ర అనే ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు.
సెకండ్ హ్యాండ్ సోఫాను ఆన్‌లైన్ స్టోర్‌లో విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు ఆమెను వీరు మోసగించారు.
మొదట కొద్ది మొత్తంలో డబ్బును హర్షితా అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసి ఆమెను నమ్మించాడు.
తర్వాత హర్షిత పంపిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలని కోరాడు. అతని మాటలను నమ్మిన హర్షిత కోడ్ ను స్కాన్ చేశారు.
ఆ తర్వాత ఆమె అకౌంట్ నుంచి రెండు విడతలుగా రూ. 20 వేలు, రూ. 14 వేలు మొత్తం 34వేల రూపాయలను కొట్టేశారు.
ఈ మోసంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.