
అపహరణ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఈ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న ఆమె మరోసారి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్‌కు వచ్చారు.
కోర్టు ఆదేశాల మేరకు బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఆమె సంతకం చేశారు.
సంతకం చేసిన అనంతరం అఖిలప్రియ మీడియాతో మాట్లాడారు. కోర్టు ఆదేశాలతో తాము పోలీసుల విచారణకు సహకరిస్తున్నామని చెప్పారు.
భవిష్యత్తులోనూ విచారణకు పూర్తి సహకారం అందిస్తామని స్పష్టం చేశారు. తాము ఈ కేసు విషయంలో ఎవరితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపలేదని ఆమె అన్నారు.
బోయిన్‌ప్లలి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న అఖిలప్రియ 15 రోజుల క్రితం కూడా పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు.
ఏసీపీ నరేశ్ రెడ్డి సమక్షంలో సంతకం చేశారు. ప్రతి 15 రోజులకోసారి పీఎస్‌కు హాజరై సంతకం చేయాలని సికింద్రాబాద్ కోర్టు ఆమెకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె మరోసారి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చారు.