ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 19వ చిత్రమిది.
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రొడక్షన్ నెం.14గా రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా రాజేంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు.
మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించారు.
ముహూర్తపు సన్నివేశానికి ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా క్లాప్ కొట్టారు. దర్శకులు భరత్ కమ్మ, రాధాకృష్ణ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
హీరో కళ్యాణ్ రామ్, నిర్మాత నవీన్ యెర్నేని, సీఈఓ చెర్రీ.. చిత్ర దర్శకుడు రాజేంద్రకు స్క్రిప్ట్‌ను అందించారు.
మార్చి రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది.
సినిమాలో హీరోయిన్ సహా ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ వెల్లడించింది.
#NKR19 under the Direction of debutant Rajendra launched today! Shoot begins in March 2nd week.
Production No.14 of @MythriOfficial
More details soon!@NANDAMURIKALYAN pic.twitter.com/HWy1QZoWiJ
— BARaju (@baraju_SuperHit) February 15, 2021
ఈ సినిమాకు రాజేంద్ర దర్శకత్వం వహిస్తుండటంతో పాటు కథ, స్క్రీన్‌ప్లేను కూడా ఆయనే అందించారు. కాగా నందమూరి కళ్యాణ్ రామ్ ఒక వైపు హీరోగా, మరోవైపు నిర్మాతగా రాణిస్తున్నారు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌తో కలిసి తన యన్.టి.ఆర్. ఆర్ట్స్ బ్యానర్‌పై తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా సినిమాను నిర్మించబోతున్నారు కళ్యాణ్ రామ్.
మరోవైపు మైత్రీ మూవీస్ బ్యానర్‌లో తాను హీరోగా సినిమా చేస్తున్నారు.