కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియా జంటగా నటిస్తున్న చిత్రం “అర్ద శతాబ్దం”.
రవీంద్ర పుల్లే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రిషిత శ్రీ క్రియేషన్స్ బ్యానర్ పై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధా కృష్ణ నిర్మిస్తున్నారు.
యంగ్ హీరో నవీన్ చంద్ర ఈ చిత్రంలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. కార్తీక్ రత్నం “C/O కంచెరపాలెం” చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించారు.
ఈ చిత్రం ఫస్ట్ గ్లిమ్ప్స్ ను స్టార్ హీరో రానా దగ్గుబాటి విడుదల చేయడంతో సినిమాపై అందరికి ఆసక్తి నెలకొంది.
తాజాగా ఈ చిత్రం నుంచి ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన “ఏ కన్నులూ చూడనీ” పాటను రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా రకుల్ చిత్రబృందానికి సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ విష్ చేశారు.
రహ్మాన్ ఈ పాటకు లిరిక్స్ అందించగా నౌఫల్ రాజా ఏఐఎస్ సంగీతం అందిస్తున్నారు ఈ సాంగ్ ప్రేమికులను బాగా ఆకట్టుకుంటోంది.
మీరు కూడా ఈ లిరికల్ వీడియో సాంగ్ ను వీక్షించండి.