హెచ్1బీ వీసాలను మంజూరు చేయొద్దు!

188
Hib Visa

హెచ్1బీ వీసాలకు అమెరికా ప్రభుత్వం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. మార్చి 9 నుంచి ఆన్ లైన్ లో వీసాల దరఖాస్తుకు ఆదేశ అధ్యక్షుడు జో బైడెన్ అనుమతులిచ్చారు.

ఈ నేపథ్యంలో గ్రీన్ కార్డులపై పరిమితిని ఎత్తేసేదాకా భారతీయులకు కొత్తగా హెచ్1బీ వీసాలను మంజూరు చేయొద్దంటూ ప్రముఖ ఇమిగ్రేషన్ స్వచ్ఛంద సంస్థ బైడెన్ ను కోరింది.

ఈ మేరకు భారతీయ అమెరికన్లకు మద్దతుగా నిలుస్తున్న ఇమిగ్రేషన్ వాయిస్ అనే సంస్థ విజ్ఞప్తి చేసింది.

గ్రీన్ కార్డులపై పరిమితి పెట్టడం వల్ల చాలా మంది వాటి కోసం దశాబ్దాల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులున్నాయని పేర్కొన్నారు.

మళ్లీ కొత్తగా హెచ్1బీ వీసాలిస్తే ఆ జాబితాలో మరికొన్ని వేల మంది చేరిపోతారని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.

ఇప్పుడు కొత్తగా వీసాలు ఇవ్వడం వల్ల కొత్తగా 60 వేల మంది అనుకోకుండానే గ్రీన్ కార్డులకు బాధితులవ్వాల్సి వస్తుందని సంస్థ అధ్యక్షుడు అమన్ కపూర్ పేర్కొన్నారు.

గ్రీన్ కార్డుల విషయాన్ని తేల్చకుండా ఎప్పటికప్పుడు హెచ్1బీ వీసాలను జారీ చేస్తూ పోతే ఇబ్బందులు తలెత్తుతాయని అన్నారు. కంపెనీల దయాదాక్షిణ్యాలమీదే ఉద్యోగులు ఆధారపడాల్సి వస్తుందని అన్నారు