హీరోయిన్ ఎమోషనల్ వీడియో… ఏడుస్తూ ఇలా…!!

268
Ragini Dwiwedi Emotional Video

గత సంవత్సరం శాండల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం రేగిన విషయం తెలియందే.

ఈ కేసులో కన్నడ హీరోయిన్లు రాగిణి ద్వివేది, సంజన గల్రానిలను పోలీసులు అరెస్ట్ కూడా చేశారు.

నటి రాగిణి ద్వివేది డ్ర‌గ్స్ కేసులో 145 రోజుల పాటు జైలు శిక్ష అనుభవించి, ఇటీవలే బెయిల్ పై విడుదలైంది.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాగిణి ఎమోషనల్ అవుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రాగిణి తనపై జరిగిన దుష్ప్రచారంపై ఆవేదనను వ్యక్తం చేసింది.

ఈ సుదీర్ఘ వీడియోలో రాగిణి తనపై, తన కుటుంబంపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న వాళ్లు తాము ఎలాంటి లాభం పొందుతున్నారో ఆలోచించుకోవాలని, మీరు చేస్తున్న కామెంట్స్ ఒకసారి మీరే చదువుకోండి అంటూ ఫైర్ అయ్యింది.

మీ కుటుంబంపై ఎవరైనా ఇలాంటి కామెంట్స్ చేస్తే మీకు ఎలా ఉంటుంది ? అని ప్రశ్నించింది. కాలం ప్ర‌తి గాయాన్ని న‌యం చేస్తుంది. కొంత కాలం త‌ర్వాత అన్ని విష‌యాల గురించి మాట్లాడుతాను.

ప్ర‌స్తుతం నేనున్న క్లిష్ట ద‌శ‌లో నాకు, నా కుటుంబానికి అండ‌గా నిలిచిన వారికి కృత‌జ్ఞ‌తలు” అని చెప్తూ కన్నీటిపర్యంతం అయ్యింది రాగిణి.