“ఉప్పెన” టాక్… అంతా క్లైమాక్స్ గురించే…!?

193
Uppena Movie Talk on Social Media

చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం “ఉప్పెన”.

ఈ సినిమా ద్వారా బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు.

వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి హీరోయిన్‌గా నటించారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

ఇప్పటికే విడుదలైన పోస్ట‌ర్లు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాట‌లు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేయడంతో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమానే అయినా ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి.

ఈరోజు “ఉప్పెన” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ క్లైమాక్స్ సీన్ గురించే చర్చించుకుంటున్నారు. ‘ఉప్పెన’ ట్రైల‌ర్ రిలీజ్ కాగానే సినిమాలో హీరో వైష్ణవ్ తేజ్‌ని చంపేస్తారనే అనుమానం అందరికీ వచ్చింది.

ఈ సినిమా క్లైమాక్స్ సీన్‌లో హీరో మర్మాంగం కటింగ్ చేసే సీన్ పెట్టారట. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఈ సీన్ గురించిన కామెంట్స్, మీమ్స్ మారుమ్రోగిపోతున్నాయి.

అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వ ప్రతిభను, హీరోహీరోయిన్లు వైష్ణవ్ తేజ్- కృతి శెట్టి కెమిస్ట్రీని పొగిడేస్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ గురించి. ప్రస్తుతం “ఉప్పెన” క్లైమాక్స్ సీన్ ట్రెండ్ అవుతోంది.

ఇదంతా చూస్తుంటే వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాకే భారీ హిట్ కొట్టేటట్టుగా అన్పిస్తోంది.