బాలీవుడ్ భామను పరిచయం చేయనున్న నాగ్ ?

154
Gul Panag to debut in Telugu with Nagarjuna’s film

టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన యాక్షన్ థ్రిల్లర్ “వైల్డ్ డాగ్” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

అనంతరం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “సోగ్గాడే చిన్ని నాయన” ప్రీక్వెల్ “బంగార్రాజు” సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే “గరుడవేగ”తో హీరో రాజశేఖర్‌కు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన ప్రవీణ్ స‌త్తారు ఓ యాక్షన్ థ్రిల్లర్ కథతో నాగార్జునను మెప్పించారు.

త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా సెట్స్ పైకి వెళ్ళనుంది.ఈ చిత్రాన్ని శరత్ మరార్ తో కలిసి ఏషియన్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఈ సినిమాలో కీల‌క పాత్ర‌లో బాలీవుడ్ నటి గుల్ పనాగ్ నటించబోతున్నారని సమాచారం. ఈ వార్త నిజ‌మైతే గుల్ ప‌నాగ్‌కు ఈ చిత్రం తెలుగులో తొలి సినిమా కానుంది.

ఇక అనిఖా సురేంద్రన్ అనే కొత్త బ్యూటీ నాగ్ రొమాన్స్ చేయబోతున్నట్టు ప్రచారం సాగుతోంది.

కాగా అక్కినేని నాగార్జున చివ‌రిగా “మ‌న్మ‌థుడు 2” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ను పలకరించాడు. అయితే ఈ చిత్రం అక్కినేని అభిమానులను నిరాశ పరిచింది.

మరి రానున్న చిత్రాలతోనైనా నాగార్జున అక్కినేని అభిమానులను ఆకట్టుకుంటాడేమో చూడాలి.