ప్రభాస్ కారణంగా వెనక్కి తగ్గిన “గని” ?

174
Varun Tej's Ghani movie to Release on September

యంగ్ హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా “గని”. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు బాబీ మరియు సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు కీలక పాత్రలలో నటించనున్నారు. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

ఇందులో బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయూ మంజ్రేకర్ హీరోయిన్‏గా నటిస్తుంది.

వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‏కు మంచి స్పందన లభించింది. ఈ సినిమాలో వరుణ్ బాక్సార్‏గా కనిపించనున్నారు.

‘గని’ సినిమా జూలై 30న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం.

అయితే అదే రోజు “రాధేశ్యామ్” విడుదల కానుంది. తెలుగుతోపాటు పలు ఇతర భాషల్లో “రాధేశ్యామ్” సినిమా జూలై 30న విడుదల కానుంది.

దీంతో “గని” చిత్ర యూనిట్ సినిమా విడుదల విషయమై పునరాలోచనలో పడినట్టు సమాచారం. “రాధేశ్యామ్”తో పాటు పలు భారీ సినిమాలు ఆ నెలలో విడుదల కాబోతున్నాయి.

అందుకే “గని” సినిమాను సెప్టెంబర్‌కు విడుదలను వాయిదా వేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

కాగా కరోనా తగ్గుముఖం పట్టడంతో థియేటర్లకు పూర్తి స్థాయి అనుమతులు వచ్చేశాయి.

దీంతో ఇప్పటి వరకు వాయిదా పడిన సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు పోటీలు పడుతున్నారు.

వేసవి నుంచి వారం గ్యాప్‌ తో పలు భారీ సినిమాలు విడుదల కాబోతున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం ఒకే తేదీన విడుదల కాబోతున్నాయి.