
సిగరెట్ తాగే వారిలో ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక బలంగా ఉంటుందా? అవునంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు.
ఆత్మహత్య చేకోవాలన్న కోరిక వారిలో ఎక్కువగా పెరిగే అవకాశాలున్నయని హెచ్చరిస్తున్నారు. ఇది చాలా విచిత్రంగా అనిపిస్తున్నప్పటికీ ఓ అధ్యయనంలో తేలిన పచ్చి నిజాలు అని చెబుతున్నారు.
అమెరికాలో ఆత్మహత్యలపై పరిశోధనలు చేసిన కొందరు నిపుణులు మాటలను బట్టి…
సిగరెట్ అలవాటును తగ్గించేందుకు ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల తర్వాత పొగతాగే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. దీంతో విచిత్రంగా ఆత్మహత్యలు కూడా 15 శాతం తగ్గాయని నిపుణులు పేర్కొన్నారు.
అయితే ఆత్మహత్యలు తగ్గడానికి, సిగరెట్ తాగడానికి ఏంటి సంబంధం అని అడిగినప్పుడు వాళ్లు మరో ఉదాహరణ చెప్పారు. సిగరెట్లపై పన్ను తగ్గించిన కొన్ని రాష్ట్రాల్లో ఆత్మహత్యల శాతం పెరిగినట్టు లెక్కలు చూపారు.
మత్తు పదార్థాలు తీసుకునే వారిలో ఆత్మహత్య ప్రేరేపిత ఆలోచనలు ఉన్నట్టే సిగరెట్ తాగే వారిలోనూ అటువంటి ఆలొచనలు ఉంటాయన్నారు.
పొగాకులో ఉండే నికోటిన్ ఇలా ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుందన్నారు.
సిగరెట్ తాగే వారిలో యాంగ్‌జైటీ, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు పెరుగుతాయని పేర్కొన్నారు.
డిప్రెషన్‌కు లోనైనప్పుడు ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక బలంగా పెరుగుతుందన్న ఈ పరిశోధన ఫలితాలను నికోటిన్ అండ్ టొబాకో రీసెర్చ్ అనే జర్నల్‌లో వెలువడింది.