లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ 19వ సినిమా

245
Hero Ram Next Movie With Lingusamy

ఎన‌ర్జిటిక్ హీరో రామ్ 19వ సినిమాపై తాజాగా అఫీషియ‌ల్ ప్ర‌కట‌న‌ వ‌చ్చింది.

‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అల‌రించిన లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ త‌దుప‌రి సినిమా ఉంటుంద‌ని ఈ ప్రకటనలో తెలిపారు.

సిల్వ‌ర్ స్కీన్ ప‌తాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్‌లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీని తెలుగు, త‌మిళ భాష‌ల‌లో రూపొందించ‌నున్నారు.

సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు మ‌రి కొద్ది రోజుల‌లో తెలియజేయనున్నారు.

కాగా హీరో రామ్ “ఇస్మార్ట్ శంక‌ర్” చిత్రంతో భారీ హిట్ అందుకున్నాడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో మాస్ ఆడియన్స్ ను మెప్పించి, మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్.

ఈ చిత్రం అందించిన విజ‌యంతో మంచి జోష్ లో ఉన్న రామ్ వ‌రుస సినిమాలతో ప్రేక్ష‌కులను అలరించేందుకు సిద్ధ‌మ‌య్యాడు.

ఇటీవలే రామ్ “రెడ్” మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.