
బాలీవుడ్ విలక్షణ నటుడు, ఎం.ఎస్. ధోనీ సినిమాలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కో-స్టార్ సందీప్ నహర్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.
33 ఏళ్ళ సందీప్ ఫిబ్రవరి 16వ తేదీన తన నివాసంలోని సీలింగ్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ నేపథ్యంలో మరణానికి ముందు ఆయనను హింసించి ఉంటారని, ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించడం జరిగి ఉండవచ్చంటూ సందీప్ భార్య కంచన్, ఆమె కుటుంబ సభ్యులపై పోలీస్ కంప్లైంట్ చేశారు సందీప్ కుటుంబ సభ్యులు.
ఈ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దాని ఆధారంగా విచారణ చేపడుతున్నారు.
కాగా పోలీసులు సందీప్ తన మరణానికి ముందు ఫేస్‌బుక్‌లో పెట్టిన వీడియోను సూసైడ్ నోటుగా పరిగణిస్తున్నారు.
ఈ వీడియోను కీలకంగా తీసుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు.
ఆ వీడియోలో సందీప్ పెళ్లి తర్వాత ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించారు. తన మరణం తర్వాత తన భార్య కంచన్‌ను ఏమీ అనకూడదని వెల్లడించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని చెప్పారు సందీప్.
మరోవైపు సందీప్ మృతదేహానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ ఇంకా అందలేదని, పోస్టుమార్టం రిపోర్టు అందిన వెంటనే హర్యానాలోని తన సొంత గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని తెలిపారు.