ఉరేసుకొని వైద్య విద్యార్థి ఆత్మహత్య!

157
Man and Grandson died in a water tank

ఉరేసుకొని ఓ వైద్య విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైద్రాబాద్ నగరంలోని బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన శశాంక్‌ (30), ఆర్‌.శరణ్‌ (28)లు ఇద్దరు అన్నదమ్ములు.

వీరు నాలుగేళ్లుగా ఓల్డ్‌ బోయిన్‌పల్లి లోని సాయి రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు.

కొన్ని రోజుల క్రితం శశాంక్‌ తనకు చెన్నై లో ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అక్కడకు వెళ్లిపోయాడు.

ఆనాటి నుంచి శరన్‌ ఇంట్లో ఒంటరిగానే ఉంటూ గాంధీఆస్పత్రి మెడికల్‌ కాలేజీలో ఎంబిబిఎస్‌ పూర్తి చేసి ఎంఎస్‌ చదవడానికి సిద్దం అవుతున్నాడు.

ఈనెల 15న ఎంబిబిఎస్‌ పూర్తి చేసిన సర్టిఫికెట్‌లు తీసుకువెళ్లేందుకు నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి చేరుకున్నాడు.

16వ తేది నాడు తల్లిరావుల సునీత పలుసార్లు శరన్‌కు ఫోన్‌ చేసిన సమాదానం లేకపోవడంతో ఆ విషయాన్ని ఫోన్‌ ద్వారా మేనమామ రాముకు చె ప్పి ఓల్డ్‌ బోయిన్‌పల్లి లోని శరన్‌ ఇంటికి వెళ్లి చూడాలని చెప్పింది.

రాత్రి రాము ఇంటికి వెళ్లి చూసేసరికి ఉరివేసుకొని కనిపించాడు.  ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.