“ఉప్పెన” ట్రైలర్ విడుదల

176
Uppena

పంజా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం “ఉప్పెన”. తాజాగా “ఉప్పెన” ట్రైలర్ ను విడుదల చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్… వైష్ణవ్ తేజ్ కు, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు.

2 నిమిషాల నిడివితో ఉన్న “ఉప్పెన” ట్రైలర్ చూస్తుంటే ప‌రువు హ‌త్య ప్ర‌ధాన‌మైన పాయింట్ గా అన్పిస్తోంది‌. హీరో హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటున్నాయి.

విజయ్ సేతుపతిని పవర్ ఫుల్ విలన్ గా చూపించారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.

ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్ దుమ్మురేపిన విషయం తెలిసిందే. టీజర్ కు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

కాగా సుకుమార్ రైటింగ్స్, మైత్రి మువీ మేకర్స్ లు సంయుక్తంగా నిర్మించిన “ఉప్పెన” సినిమాకు సానా బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. “ఉప్పెన” చిత్రంలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించగా… దేవీశ్రీ ప్రసాద్ సంగీతాన్నందించాడు.