కరీంనగర్ డీసీసీబీ దేశానికే తలమానికం: మంత్రి నిరంజన్ రెడ్డి

243
Niranjan reddy

కరీంనగర్ డీసీసీబీ దేశానికే తలమానికంగా నిలిచిందని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కేంద్ర బ్యాంక్ కార్యాలయాన్ని మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..దేశంలోని 393 డీసీసీబీల్లో అత్యుత్తమ బ్యాంకుగా కరీంనగర్ డీసీసీబీ ఎంపిక కావడం తెలంగాణాకు గర్వకారణం అన్నారు.

రాష్ట్రంలో సహకార వ్యవస్థను బలోపేతం చేస్తామని మంత్రి అన్నారు. ఈసందర్భంగా సుమారు రూ. 100 కోట్ల రుణాలను ఆయా సంఘాలకు పంపిణీ చేశారు. రాష్ట్రంలోని మిగతా డీసీసీబీల పనితీరును మెరుగు పర్చేందుకు టెస్కాబ్ చైర్మన్ గా తన వంతు కృషి చేయాలని కొండూరు రవిందర్ రావును కోరారు.

రానున్న రబీ సీజన్ లో పంట దిగుబడులు విపరీతంగా రానున్నా దృష్ట్యా సహకార సంఘాలు ముందుండి రైతులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మన్ రావు, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.