మహేష్ బాబు ఫాన్స్ కి ఉగాది సర్ ప్రైజ్

307
ugadi surprise to mahesh babu fans

సూపర్‌ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో భరత్‌ అనే నేను సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడు. వరుస బ్లాక్‌ బస్టర్‌లతో ఫుల్‌ ఫాంలో ఉన్న కొరటాల మహేష్‌ కెరీర్‌ను తిరిగి గాడిలో పడతాడన‍్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్‌. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలను ప్రారంభించిన సినిమా యూనిట్‌ ఉగాది సందర్భంగా ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేసింది.



 

మహేష్ సాంప్రదాయ దుస్తుల్లో దైవ దర్శనానికి వెలుతున్నట్టుగా ఉన్న పోస్టర్‌ అభిమానుల్లో మరింత జోష్ పెంచింది. మహేష్ సరసన కైరా అద్వాని హీరోయిన్‌గా నటిస్తున్న ఈసినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఏప్రిల్‌ 20న సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.