తెలంగాణా డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టులు

352
1384 posts in telangana degree colleges

తెలంగాణ రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను బలోపేతం చేయడంలో భాగంగా 1 వెయ్యి 384 పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసింది. దీనిపై ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇందులో 1 వెయ్యి 214 డిగ్రీ లెక్చరర్ల పోస్టులు (వివిధ సబ్జెక్టులలో కలిపి) ఉన్నాయి. 15 ప్రిన్సిపాల్ పోస్టులు, 67 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, 63 గ్రంథాలయ అధ్యాపక పోస్టులు, 24 అడ్మినిస్ట్రేషన్ పోస్టులు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది.



 

ఈ మొత్తం పోస్టులలో 75 శాతం పదోన్నతుల ద్వారా, 25 శాతం రెగ్యులర్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కోటా పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. మరోవైపు 12 కేటగిరీల్లోని పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏప్రిల్‌, మే నెలల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. సీబీఆర్టీ విధానంలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు TSPSC సెక్రటరీ వాణీప్రసాద్‌.


డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టులను మంజూరుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తెలంగాణ ప్రభుత్వం కాలేజీ గెజిటెడ్ టీచర్ అసోసియేషన్ (TGCGTA) రాష్ట్ర నాయకులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం (మార్చి-17) వారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.