యుగంధర్ ముని దర్శకత్వంలో నితిన్ ప్రసన్నను హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘A'(AD INFINITUM). అవంతిక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై “A” మూవీ తెరకెక్కుతోంది.
“A” సినిమాలో ప్రీతి అశ్రాని హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రీతీ ఇప్పటికే మళ్ళీరావా, ప్రెషర్ కుక్కర్ చిత్రాల్లో నటించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ “A” ట్రైలర్ ను కాసేపటి క్రితం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి విడుదల చేశారు. చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు విజయ్ సేతుపతి.
ఇక “A” ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. సైన్స్, డిమాండ్స్, సాక్రిఫైజ్ అనే మూడు అంశాలను టచ్ చేస్తూ… సస్పెన్స్, రొమాన్స్ ను చూపించారు.
ఒక వ్యక్తిని కల రూపంలో గతం వెంటాడటం, దీనికి మెడికల్ మాఫియా లింకు ఉండడం లాంటి సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
మొత్తానికి “A” ట్రైలర్ సినిమాపై హైప్ పెంచేసిందనే చెప్పుకోవాలి. ఒకవైపు షూటింగ్ కొనసాగిస్తూనే… మరోవైపు ప్రమోషన్స్ జోరు పెంచారు చిత్రబృందం.
మార్చి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.