మోసగాళ్లు : “డబ్బులు సంపాదించాలంటే…” లిరికల్ వీడియో సాంగ్

283
Dabbulu Sampaadinchalante Song Lyrical From Mosagallu

మంచు విష్ణు, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ “మోసగాళ్లు”. జెఫ్రే గీ చిన్ “మోసగాళ్లు” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవదీప్, సునీల్ శెట్టి కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా “మోసగాళ్లు” సినిమా నుంచి మొదటి పాటను విడుదల చేశారు చిత్రబృందం. “డబ్బులు సంపాదించాలంటే…” అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శ్యామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

ఇక ఇప్పటికే “మోసగాళ్లు” చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాగా మంచు విష్ణు విషయానికొస్తే… గత కొంతకాలంగా మంచు విష్ణుకు సరైన హిట్ రాలేదు. మంచు విష్ణు చివరగా నటించిన ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ చిత్రాలు ఆయన అభిమానులను తీవ్రంగా నిరాశ పరిచాయి.

దీంతో చాలా గ్యాప్ తీసుకున్న మంచు విష్ణు తాజాగా “మోసగాళ్లు” చిత్రంతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరి ఈ చిత్రంతోనైనా విష్ణు మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూడాలి.