షార్ట్ ఫిలిమ్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న జయకిశోర్ బి. సినీ వైన్ షాప్ నేపథ్యంలో ‘మధుర వైన్స్’ అనే సినిమా ట్రైలర్ హీరో కార్తికేయ చేతులు మీదుగా విడుదల అయి మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది.
జయకిశోర్ రూపొందించిన ’15 డేస్ ఆఫ్ లవ్’ అనే షార్ట్ ఫిల్మ్ యూట్యూబ్‌లో 17 మిలియన్ వ్యూస్ సంపాదించడం ఒక విశేషంగా చెప్పుకోవాలి.
సన్నీ నవీన్, సీమా చౌదరి ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం “మధుర వైన్స్”. ఈరోజు ఈ చిత్రం ట్రైలర్ ను హీరో కార్తికేయ విడుదల చేశారు.
“మధుర వైన్స్” ట్రైలర్ లో హీరో హీరోయిన్ మధ్య ప్రేమకథ, వారిద్దరి మధ్య అపార్థాలు, ఇంకా “మధుర” వైన్స్ వల్ల కలిగిన సైడ్ ఎఫెక్ట్స్ ను చూపించారు. మీరు కూడా ఈ ట్రైలర్ ను వీక్షించండి.
“మధుర వైన్స్” చిత్రం జయకిషోర్ దర్శకత్వంలో రూపొందుతోంది. మరియు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
‘మధుర వైన్స్’ సినిమాని ఆర్.కె. సినీ టాకీస్ బేనర్ పై రాజేశ్ కొండేపు నిర్మిస్తున్నారు. కార్తీక్ కుమార్ రోడ్రిగ్జ్ సంగీత దర్శకుడు.