తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి స్వస్తి..?

232
Police Telangana

తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇక మీదట ఆందోళనలు తీవ్ర రూపం దాల్చితే కఠినంగా వ్యవహరించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానానికి కొన్ని రోజుల పాటు స్వస్తి చెప్పాలని నిర్ణయించారు. కాగా మహిళలు, రైతులపై సంయమనం పాటించాలని పోలీసులకు సూచించారు.

ఇప్పటికే అన్ని జిల్లా కమిషనర్లకు, ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

తెలంగాణలో రాజకీయ పార్టీలు నిరసనలు పెరిగాయి. ప్రజా ప్రతినిధుల ఇళ్ల ముందు ప్రత్యర్థి పార్టీలకు చెందిన నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.