మహేష్ బాబు త్రో బ్యాక్ పిక్ వైరల్

218
The throwback picture of Mahesh Babu Goes Viral

సూపర్ స్టార్ మహేష్ బాబు కు సంబంధించిన త్రో బ్యాక్ పిక్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 2007లో మహేష్ నటించిన “అతిధి” చిత్రంలోనిది ఆ పిక్. అయితే అంతవరకు బయటపెట్టని ఆ పిక్ తాజాగా బయటకు వచ్చింది.

ఇందులో మహేష్ బూడిద రంగు చొక్కా, నల్ల ప్యాంటు, నల్ల కోటు ధరించి… రైఫిల్ పట్టుకొని పొగ మధ్య నడుచుకుంటూ రావడం చూడొచ్చు.

అయితే ఈ పిక్ “అతిధి” చిత్రంలో మహేష్ ఇంట్రో సాంగ్ కు సంబంధించిన పిక్ అని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ అమృత రావు హీరోయిన్ గా నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ “అతిధి”కి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.

రోనీ స్క్రూవాలా, సిద్ధార్థ్ రాయ్ కపూర్, రమేష్ బాబు సంయుక్తంగా నిర్మించారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద యావరేజ్ వసూళ్లను సాధించింది.

ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” చిత్రంతో బిజీగా ఉన్నారు. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతోంది.

షార్జాలోని మెలీహా పట్టణంలో సినిమాలోని కీలకమైన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.