టాలెంటెడ్ హీరో సత్యదేవ్ కుమారుడి ఫస్ట్ బర్త్ డే… ఫ్యామిలి పిక్ వైరల్

180
Satyadev shares adorable family picture

టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ షేర్ చేసిన ఫ్యామిలీ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

అయితే చాలామందికి అసలు సత్యదేవ్ కు వివాహమై, ఒక కొడుకు కూడా ఉన్నాడన్న విషయం తెలియదనే చెప్పాలి.

ఈ 31 ఏళ్ళ యంగ్ హీరో దీపికా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

సత్యదేవ్ మొదట్లో సినిమా అవకాశాల కోసం స్ట్రగుల్ అవుతున్నప్పుడు దీపికా అతనికి చాలా సపోర్ట్ ఇచ్చింది. ఇక సత్యదేవ్ కుమారుడు సావర్నిక్ మొదటి పుట్టినరోజు ఈరోజు.

ఈ సందర్భంగా “సావర్నిక్ మొదటి పుట్టినరోజు. నా జూనియర్‌ కు ఎల్లప్పుడూ మీ ప్రేమ, శుభాకాంక్షలు కావాలి” అంటూ ఇన్స్టాగ్రామ్ లో ఫ్యామిలీ పిక్ ను పోస్ట్ చేశాడు సత్యదేవ్.

 

View this post on Instagram

 

A post shared by Satyadev (@actorsatyadev)

కెరీర్ మొదట్లో షార్ట్ ఫిలిమ్స్, సినిమాల్లో ప్రధాన పాత్రలు చేస్తూ వచ్చిన సత్యదేవ్ వైవిధ్యమైన పాత్రలు పోషించి, టాలెంట్ ఉన్న హీరోగా సత్తా చాటుకున్నాడు.

2015లో వచ్చిన “జ్యోతిలక్ష్మి”తో సత్యదేవ్ కు గుర్తింపు లభించింది.

ఆ తరువాత వరుసగా ఘాజీ, మన వూరి రామాయణం, క్షణం, అప్పట్లో ఒకడుండేవాడు, బ్లఫ్ మాస్టర్, బ్రోచేవారెవరురా, ఉమా మహేశ్వర ఉగ్రా రూపస్య’ చిత్రాలతో సత్యదేవ్ నటుడిగా మంచి గుర్తింపును సంపాదించాడు.

ప్రస్తుతం సత్యదేవ్ ‘తిమ్మరుసు’, ‘గాడ్సే’ చిత్రాల్లో కథానాయకుడిగా నటించడంతో పాటు, కన్నడ రొమాంటిక్ మూవీ “లవ్ మోక్‌టెయిల్” తెలుగు రీమేక్ లో తమన్నాతో రొమాన్స్ చేస్తున్నారు.

అంతేకాదు ఆంథాలజీ చిత్రం ‘పిట్ట కథలు’లో కూడా సత్యదేవ్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.