షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుంది!

225
Someone behind Sharmila's party

తెలంగాణలో వైయస్ షర్మిల రాజకీయ ఆరంగేట్రం చేయనున్నట్టు తెలుస్తోంది. తన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో ఆమె పార్టీని ప్రారంభించనున్నారు.

లోటస్‌ పాండ్‌లో ష‌ర్మిల ఫ్లెక్సీలు వైఎస్సార్‌ అభిమానుల కోలాహ‌లం నెల‌కొంది.
ఈ రోజు నుంచి వివిధ జిల్లాల పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆమె వరుస సమావేశాలు నిర్వహించాడానికి సిద్దమవుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. ఇతర పార్టీల మేలు కోసం షర్మిల రాజన్న పేరును వినియోగించొద్దని సూచించారు.

రాజీవ్ రాజ్యం అయినా, రాజన్న రాజ్యం అయినా కాంగ్రెస్‌తోనే సాధ్యమని సీతక్క వ్యాఖ్యానించారు.షర్మిల పార్టీ వెనుక ఎవరున్నారో త్వరలో బయట పడుతుందని సీతక్క అన్నారు.

కాంగ్రెస్ పార్టీ, వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వేర్వేరు కాదన్నారు. వైఎస్ షర్మిల ఒక్కోసారి ఒక్కొక్కరికి బాణంగా ఉపయోగపడుతుందని సీతక్క అన్నారు.