“ఫ్యామిలీ మ్యాన్-2” వెబ్ సిరీస్ విడుదల వాయిదా

166
'The Family Man' Season 2 Postponed

ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న వెబ్ సిరీస్ “ఫ్యామిలీ మ్యాన్-2” విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రకటించింది.

“ఫ్యామిలీ మ్యాన్” సీజన్‌ 2 కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుసు. మీ ప్రేమకు, అభిమానానికి కృతజ్ఞతలు. మీ అందరికీ ఓ అద్భుతమైన అనుభవాన్ని అందించేందుకే విడుదలను వేసవికి వాయిదా వేస్తున్నాం” అంటూ సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో మెసేజ్ పోస్ట్ చేసింది.

గతంలో రాజ్, డీకే తెరకెక్కించిన ‘ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్ సిరీస్ విడుదలైన అన్ని భాషల్లోనూ విశేష స్పందనను దక్కించుకుంది. మొదటి సీజన్లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించారు. తాజాగా “ఫ్యామిలీ మ్యాన్-2” వెబ్ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు మేకర్స్.

ఈ రెండవ సీజన్ లో మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణితో పాటు సమంత కూడా కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఇందులో సమంత టెర్రరిస్ట్ గా కనిపించనుంది. ఇప్పటికే “ఫ్యామిలీ మ్యాన్-2” వెబ్ సిరీస్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ విడుదల వాయిదా పడడం ప్రేక్షకులను నిరాశ పరిచే విషయమే. ఈ నెల 12వ తేదీన ప్రైమ్ వీడియోస్‌లో విడుదల కావాల్సిన “ఫ్యామిలీ మ్యాన్-2” వెబ్ సిరీస్ ఇప్పుడు వాయిదా పడింది.