“చిన్న బ్రేక్‌…” అంటూ న్యూ లుక్ లో రామ్

257
Ram Pothineni Latest Pic Goes Viral in Social Media

యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పోస్ట్ చేసిన పిక్ ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. “ఓం నమః శివాయ, చిన్న బ్రేక్‌ తీసుకున్నాను. మళ్లీ వస్తాను” అంటూ ఓ స్పెషల్ పిక్ ను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు.

అయితే రామ్ ఎందుకు బ్రేక్ తీసుకున్నారంటే… ఆయన శివ మాలను ధరించారు. ఈ శివ దీక్ష 41 రోజులు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే రామ్ చిన్న బ్రేక్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన “ఇస్మార్ట్ శంకర్”తో భారీ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్. చాలా గ్యాప్ తరువాత “ఇస్మార్ట్ శంకర్”తో రామ్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అదే జోష్ లో ఆ తరువాత రామ్ నటించిన “రెడ్” ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

భారీ అంచనాలతో ఈ సంక్రాంతికి విడుదలైన “రెడ్” చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. ఇక ఆ తరువాత రామ్ తన తరువాత సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. మరి ఈ చిన్న బ్రేక్ తరువాత రామ్ తన తదుపరి చిత్రంపై క్లారిటీ ఇస్తారేమో వేచి చూడాలి.