హాలీవుడ్ ఆఫర్ ని తిరస్కరించిన బాలీవుడ్ తారలు

164
bollywood-actors-who-rejected-hollywood-offer

బాలీవుడ్‌లో విజయం సాధించాక ఏ సినీ తారకైనా హాలీవుడ్‌లో పనిచేయాలనే కోరిక ఉంటుంది. వారు ఆలా తమ నటన తో హాలీవుడ్‌లో కూడా చోటు సంపాదించి డబ్బు, పేరు ప్రతిష్టలు పొందుతారు.

కానీ ఏవో కొన్ని కారణాల వల్ల హాలీవుడ్ చిత్రాలలో పని చేసే అవకాశం వచ్చినా వారు ఆ ఆఫర్ ని తిరస్కరించిన బాలీవుడ్ తారలు కూడా ఉన్నారు. అలాంటి 9 మంది బాలీవుడ్ నటీ నటుల గురించి తెలుసుకుందాం.

గోవింద – 2009 లో అవతార్ సినిమా లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించడానికి ఆయనకు ఆఫర్ వాచినట్టు గోవింద ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కానీ కొన్ని కారణాల వల్ల, ఆ ఆఫర్‌ను తాను తిరస్కరించాల్సి వచ్చిందని, ఆ సినిమాకి అవతార్ అని పేరు పెట్టమని జేమ్స్ కామెరాన్‌కు సలహా ఇచ్చినది కూడా నేనే అని గోవింద ఆ ఇంర్వ్యూ లో చెప్పారు.

ఇర్ఫాన్ ఖాన్ – దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కి హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా ‘ఇంటర్స్టెల్లార్’ లో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ బాలీవుడ్ చిత్రం ‘లంచ్ బాక్స్’ షూటింగ్ కారణంగా అతను ఈ ప్రతిపాదనను తిరస్కరించాడు. దాని తర్వాత ఇర్ఫాన్ ఖాన్ ది అమేజింగ్ స్పైడర్ మాన్, జురాసిక్ వరల్డ్, ఇన్ఫెర్నో మరియు లైఫ్ ఆఫ్ పై అనేక ఇతర హాలీవుడ్ చిత్రాలలో నటించాడు అనే విషయం అందరికి తెలిసిందే.

హృతిక్ రోషన్ – హృతిక్ రోషన్ 2006 లో హాలీవుడ్ చిత్రం ‘పింక్ పాంథర్ 2’ లో నటించడానికి ఆఫర్ వచ్చింది. కానీ బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్నందున ఈ ఆఫర్‌ను ఆయన తిరస్కరించారు.

ప్రియాంక చోప్రా – ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో బేవాచ్, క్వాంటికో, వి కెన్ బీ హీరోస్ వంటి సినిమాలు చేయడంలో బిజీగా ఉంది. కానీ బాలీవుడ్ ముద్దుగుమ్మ ‘సాత్ ఖూన్ మాఫ్’ అనే చిత్రం షూటింగ్‌లో ఉండడం వల్ల హాలీవుడ్ సినిమా ‘ఇమ్మోర్టల్’ చేయలేక ఆ ఆఫర్ ని తిరస్కరించింది.

దీపికా పదుకొనే – షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించిన ‘హ్యాపీ న్యూ ఇయర్’ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండడం వల్ల దీపికా పదుకొనే, 2015 లో హాలీవుడ్ సినిమా ‘ఫ్యూరియస్ 7’ లో నటించే ఆఫర్‌ను తిరస్కరించవలసి వచ్చింది..

నసీరుద్దీన్ షా – హ్యారీ పాటర్ చిత్రం యొక్క ప్రసిద్ధ పాత్ర, ప్రొఫెసర్ ఆల్బస్ డంబుల్డోర్ పాత్ర చేసే అవకాశం మొదట బాలీవుడ్ నటుడు నసీరుద్దీన్ షాకు వచ్చింది. కానీ ఆడిషన్‌లో కొన్ని సమస్యల కారణంగా ఆ అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చింది.

షారూఖ్ ఖాన్ – బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ చేసిన హాలీవుడ్ చిత్రం ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ లో గేమ్ షో హోస్ట్ ప్రేమ్ కుమార్ పాత్ర పోషించారు. కానీ అనిల్ కపూర్ కంటే ముందు ఆ పాత్రను చేసే అవకాశం హీరో షారుఖ్ ఖాన్ కు వచ్చింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పాత్ర చేయలేకపోయారు.

ఐశ్వర్య రాయ్– వోల్ఫ్‌గైన్ పీటర్సన్ దర్శకత్వం వహించిన హాలీవుడ్ చిత్రం ‘ట్రై’లో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ ఈ చిత్రం లో బోల్డ్ సన్నివేశాలు ఉండడం వల్ల ఆమె ఆ ఆఫర్ ని తిరస్కరించాల్సి వచ్చింది.

రోనిత్ రాయ్ – ఆస్కార్ నామినేటెడ్ హాలీవుడ్ చిత్రం జీరో డార్క్ థర్టీలో నటుడు రోనిత్ రాయ్ కి ఒక ముఖ్యమైన పాత్ర పోషించే అవకాశం లభించింది. కానీ బాలీవుడ్ చిత్రం ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’ కారణంగా, అతను దానిని తిరస్కరించాల్సి వచ్చింది.