తెలంగాణ నుంచి బంగ్లాదేశీయులకు భారత పాస్‌పోర్టు!

206
Indian Passport

 తెలంగాణలోని   నిజామాబాద్ జిల్లా నుంచి బంగ్లాదేశీయులకు భారత పాస్‌పోర్టు జారీ చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ పాస్‌పోర్టుల జారీ వెనక బోధన్ పోలీసుల పాత్ర ఉన్నట్టు ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు వారిని విచారణ కోసం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.

బంగ్లాదేశీయులకు నిజామాబాద్ నుంచి భారత పాస్‌పోర్టులు జారీ అయిన విషయాన్ని గుర్తించిన శంషాబాద్ విమానాశ్రయ పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ వ్యవహారంలో గతంలో బోధన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేసి, ప్రస్తుతం సిద్దిపేటలో ఎస్సైగా పనిచేస్తున్న వ్యక్తి పాత్ర ఉన్నట్టు అధికారులు గుర్తించారు.

బోధన్‌లో స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సైగా పనిచేస్తున్న మరొకరు కూడా ఈ పాస్‌పోర్టుల జారీ వెనక ఉన్నట్టు అదికారులు నిర్దారించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలతో కమిషనరేట్ అధికారులను కలిసి వారిద్దరినీ విచారణ కోసం తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ ఇలా ఇంకెంతమందికి పాస్‌పోర్టులు జారీ చేసి ఉంటారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.