నటి సురేఖా వాణి వీసా తిరస్కరణ – అందుకేనా ?

1068
telugu-actress-surekha vani visa-rejected

సురేఖావాణి, డ్యాన్సర్, సినీ నటి, టీవీ ఆర్టిస్టుగా అందరికీ పరిచయమే, అమెరికా తెలుగు అసోసియేషన్ సదస్సులో పాల్గొనేందుకు ఆమెకు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆమె బీ1, బీ2 వీసా కోసం ధరఖాస్తు చేసుకొన్నారు. జూన్ 22వ తేదిన ఆమె వీసా ఇంటర్వ్యూ కోసం వెళ్ళారు. ఆటా సదస్సులో పాల్గొనేందుకు వెళ్తున్నట్టు ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. దీంతో ఆమెకు అధికారులు వీసా ఇచ్చేందుకు నిరాకరించారు.

అమెరికాలో తెలుగు సదస్సులకు అధికారిక బృందాలు వెళుతుంటాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి 24 మందితో కూడిన బృందం అమెరికా తెలంగాణ సదస్సుకు వెళ్లడానికి వీసా ఇవ్వాలని అభ్యర్థిస్తూ లేఖ రాసింది. ఆ దరఖాస్తులను పరిశీలించిన కాన్సులేట్‌ ప్రతినిధి నలుగురికే వీసా ఇస్తామని ముందస్తు సమాచారం ఇచ్చి మిగిలిన దరఖాస్తులన్నీ తిరస్కరించారు.

షికాగోలో సెక్స్‌ రాకెట్‌ లో కొందరు తెలుగు అసోసియేషన్ల పేర్లను ఉపయోగించుకొన్నారని ప్రచారం కూడ లేకపోలేదు. దీంతో సినీ, టీవీ ఆర్టిస్టులతో పాటు తెలుగు అసోసియేషన్ల ఆహ్వానం మేరకు అమెరికాకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తున్న వారికి వీసాల విషయంలో అమెరికా ఆచితూచి వ్యవహరిస్తోంది.వీసా కోసం ఆన్‌లైన్‌లో డీఎస్‌ 160 ఫామ్‌ సమర్పించాలి. ఆ ఫామ్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా వీసా ఇవ్వాలా? లేదా? అన్న నిర్ణయానికి వస్తారు. కానీ షికాగో ఘటన తర్వాత తెలుగు సదస్సులకు వెళ్లే 90 శాతం మంది వీసా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.

మే నెలలో యూఎస్‌ వీసా కోసం వచ్చిన (బీ1బీ2) దరఖాస్తుల్లో 65 శాతం మందికి వీసాలు మంజూరయ్యాయి. అదే జూన్‌ మాసంలో వీసాలు తిరస్కరణలు 70 శాతానికి పెరిగాయి. మే 12వ తేదీ–28వ తేదీ మధ్య మూడు వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరయ్యారు.వీరిలో 1,950 మందికి(65 శాతం) వీసా మంజూరైంది. అదే మే 29వ తేదీ–జూన్‌ 22వ తేదీ వరకూ సుమారు 4 వేల మంది వీసా ఇంటర్వ్యూకు హాజరైతే 1,350 మందికే వీసాలు దక్కాయి.