ఆంధ్ర వర్శటీలో బీఎస్సీ చదువుకు బదులుగా బీకామ్ పట్టా ఇవ్వడంపై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆంధ్ర వర్శటీ వైస్ చాన్సలర్‌తో ఆదివారం మంత్రి గంటా మాట్లాడారు. బీఎస్సీ చదివిన విద్యార్థికి బీకామ్ పట్టా ఎలా ఇస్తారని? సూటిగా ప్రశ్నించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. బీఎస్సీ విద్యార్థికి బీకాం డిగ్రీ పట్టా ఇచ్చిన బాధ్యులను వెంటనే సస్పండ్ చేయాలని వీసీకి ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర నివేదిక ఇవ్వాలని స్పష్టీకరించారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడద్దని, ఇలాంటి ఘటనలు పునరావృతమైతే విధుల నుంచి తొలగించాల్సి ఉంటుందని మంత్రి గంటా శ్రీనివాసరావు వర్శిటీ అధికారులను హెచ్చరించారు.