ఈ రోజు రాశి ఫలాలు – 25 సోమవారం జూన్ 2018

690
today rashi phalalu

శ్రీవిళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, నిజ జ్యేష్ఠమాసం, శుక్లపక్షం; తిథి: అష్టమి తె. 3.52 తదుపరి నవమి; నక్షత్రం: ఉత్తర రా. 1.19 తదుపరి హస్త; వర్జ్యం: ఉ. 8.50-10.24; దుర్ముహూర్తం: ఉ. 11.51-12.43; అమృతఘడియలు: సా. 6.15-7.50; రాహుకాలం: మ. 12.00-1.30; సూర్యోదయం: 5.44; సూర్యాస్తమయం: 6.50

మేషం : మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. మీ పిల్లలు మీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. ప్రయాణం కానీ, దేవాలయ సందర్శన కానీ చేస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలుంటాయి. కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వివాహ విషయంలో శుభవార్త వింటారు.

వృషభం : ఈ రోజు చాలా కాలం నుంచి వాయిదా పడుతున్న పనులు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. వాటిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. అలాగే ఉద్యోగంలో మీ పనికి మంచి గుర్తింపు వస్తుంది. ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్న వారు అనుకూల ఫలితం పొందుతారు.

మిథునం : ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవటం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. సంతానం ఆరోగ్యం కారణంగా కొంత ఆందోళనకు లోనవుతారు.

కర్కాటకం : ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. భూసంబంధ లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి.

సింహం : ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసిన బకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చాల్సిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. పుకార్లను నమ్మకండి.

కన్య : చేపట్టిన పనులు వాయిదా పడడం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టువదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.

తుల : దూర ప్రదేశం నుంచి ఒక శుభ వార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. తొందరపడి ఏ పని ప్రారంభించకండి. మాట విషయంలో జాగ్రత్త అవసరం.

వృశ్చికం : ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

ధనుస్సు : ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మితృలను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

మకరం : ఈ రోజు వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరటం, లక్ష్యానికి చేరువవడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలో విదేశీయానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

కుంభం : ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.

మీనం : ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.