‘రెడ్‌మీ 6ప్రొ’ స్మార్ట్‌ఫోన్ విడుదల

680
xiaomi-redmi-6-pro-launched-today

చైనాకు చెందిన మొబైల్ తయారీదారు షియోమీ తన నూతన స్మార్ట్‌ఫోన్ ‘రెడ్‌మీ 6ప్రొ’ను సోమవారం ఆ దేశ మార్కెట్‌లో విడుదల చేసింది. రేపటి నుంచి వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. బ్లూ, బ్లాక్, రెడ్, రోజ్ గోల్డ్, గోల్డ్ కలర్ వేరియెంట్లలో ఈ ఫోన్‌ను కంపెనీ అందుబాటులో ఉంచింది. ఇక ధర విషయానికి వస్తే 3జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 10, 520, 4జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 13, 555గా నిర్ణయించారు. కాగా, ఇండియన్ మార్కెట్‌లోనూ త్వరలోనే ఈ మొబైల్ విడుదల కానుందని సమాచారం. ఇప్పటికే రెడ్‌మీ 5, రెడ్‌మీ 5ఎ, రెడ్‌మీ 5ప్రొ ఫోన్లకు భారత వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ‘రెడ్‌మీ 6ప్రొ’ స్మార్ట్‌ఫోన్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని సంస్థ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.



 

‘రెడ్‌మీ 6ప్రొ’ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు…
5.84 ఇంచ్ ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే(2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్)
2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్
3/4 జిబి ర్యామ్, 32/64 జిబి స్టోరేజ్(256జిబి వరకు విస్తరించుకునే సదుపాయం )
ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
12, 5 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
ఫింగర్‌ప్రింట్ సెన్సార్(ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్)
4జి విఒఎల్‌టిఇ
బ్లూటూత్ 4.2
4000 ఎంఎహెచ్ బ్యాటరీ.