నా చావుకి కారణం మోహన్ బాబే… మరో సీరియల్ నటి ఆత్మహత్య

357
tamil tv artist

మోహన్ బాబు కారణంగా మనస్తాపం చెందిన ఓ తమిళ నటి సూసైడ్ చేసుకుంది. మోహన్ బాబు ప్రేమించి మోసం చేయటం తోనే చనిపోతున్న అంటూ తన అమ్మకి మెసేజ్ పంపి మరి చనిపోయింది.
 

మేరీ షీలా జేబిరాణి అలియాస్ యాషిక యాక్టింగ్ మీద మక్కువతో చెన్నై వెళ్ళింది. అక్కడ అవకాశాలు దక్కించుకొని పాలు సీరియళ్లలో నటించింది. కాగా చెన్నై వెళ్లాకా… యాషిక హాస్టల్లో ఉంది. అక్కడ సమీపంలో ఉన్న మొబైల్ షాప్ ఓనర్ అరవింద్ అలియాస్ మోహన్ బాబు తో స్నేహం మొదలై ప్రేమగా మారింది . కొన్ని నెలల పాటు వీరిద్దరూ సహజీవనం కుడా చేసారు.

తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. దీంతో యాషికని మోహన్ బాబు హింసించటం మొదలు పెట్టాడు. దీంతో విసిగి పోయిన యాషిక మోహన్ బాబుని ఇంట్లో నుండి బయటకి పంపింది. మోహన్ బాబు తర్వాత యాషికని పట్టించుకోవటం మానేసాడు. దీంతో తాను మోసపోయాను అని గ్రహించిన యాషిక చనిపోవాలని డిసైడ్ అయింది. చనిపోయే ముందు తన చావుకి మోహన్ బాబే కారణం అతనిని శిక్షించండి అంటూ తల్లికి మెసేజ్ చేసి ఆత్మ హత్య చేసుకొని ప్రాణాలు విడిచింది. యాషిక తల్లి పోలీసులకి చెప్పటంతో కేసు నమోదు చేసుకున్న పోలీస్ లు మోహన్ బాబు ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు