యాంకర్ లాస్య…. అందరికీ సుపరిచితురాలే. ఇంకా చెప్పాలంటే … రవి లాస్య…. ఇలా అయితే ఎవరు అన్న ప్రశ్నే రాదు… రవిలాస్య జోడీ స్మాల్ స్క్రీన్ పై అంత ఫేమస్ మరి. అయితే నిజజీవితంలో మంజునాథ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య…. ఇప్పుడు ఫీల్డ్ కు కాస్త దూరంగా ఉంది. ఎందుకబ్బా అని అంటే… విషయం ఇది.
లాస్య తల్లి కాబోతోంది. తమ సెకండ్ మ్యారేజీ యానివర్సరీ జరుపుకుంటున్న లాస్య మంజునాథ్ లు… ఈ తీపి కబురు చెప్పారు. ఇప్పుడు మా లైఫ్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మరి కొద్ది రోజుల్లో మా మధ్యకు లిటిల్ హనీ రాబోతోందన్నారు. మరికొద్ది రోజుల్లో మా ముగ్గురితో చిన్ని కుటుంబం ఏర్పడబోతోందంటూ తమ హ్యాపీనెస్ ను షేర్ చేసుకున్నారు. దీంతో నెటిజన్లు డబుల్ కంగ్రాట్స్ చెబుతున్నారు.