త్వరలో రానా, త్రిషల పెళ్లి…ఆర్య చెబుతోంది నిజమేనా?

925
arya sayesha

ఆర్య, సయేషా సైగల్ ల ప్రేమ వ్యవహారంపై వస్తున్న వార్తలకు ప్రేమికుల రోజు సందర్భంగా ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఔను.. మేమిద్దరం ఇష్టపడ్డామంటూ… సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చిన ఇద్దరు… మార్చ్ లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. దీంతో సన్నిహితులు, స్నేహితులు ఇద్దరికి విష్ చేశారు.
 

ఇందులో ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్ … రానాకి, ఆర్యకి మధ్య జరిగింది. ఆర్యకు కంగ్రాట్స్ చెప్తూ … హ్యాపీ లాస్ట్ సింగిల్ వాలెంటైన్స్ డే అంటూ ట్వీట్ చేశాడు రానా. దీనిపై స్పందించిన ఆర్య.. థాంక్స్ మచ్చా… మీ నుంచి కూడా త్వరలో తీపి కబురు వింటామని ఆశిస్తున్నామంటూ రీ ట్వీట్ చేశాడు.

దీంతో నెటిజన్లు త్రిష, రానాల మధ్య లవ్ ట్రాక్ ఇంకా కొనసాగుతుందని చెప్పుకుంటున్నారు. త్వరలో వీళ్లిద్దరికి కూడా వివాహం జరగనుందా ? అనే అనుమానాలు వెళ్లబుచ్చుతున్నారు. చూద్దాం… త్రిష, రానాలు తమ లవ్ కు .. మ్యారేజ్ తో ఫుల్ స్టాప్ పెడతారా…? లేక బ్రేకప్ తో ఫుల్ స్టాప్ పెడతారా?