ఇక సెల్‌ఫోన్‌తో డబ్బులు సంపాదించే అవకాశం

661
money earning with cellphone

నల్లగొండ టౌన్‌: నిత్యజీవితంలో ప్రతిరోజూ టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాలతో వాణిజ్య ప్రకటనలు చూస్తునే ఉంటాం. దీంతో వాటిని తెలుసుకోవడం తప్ప పెద్ద ప్రయోజనమేమీ ఉండదు. కానీ సుమంత్‌రెడ్డి సృష్టించి క్విక్‌ యాడ్స్‌ యాప్‌ తో యాడ్స్‌ను వీక్షించడం ద్వారా డబ్బులు సంపాదించవచ్చు. మనం రోజు వాడే ద్వారా డబ్బులు సంపాదించే యాప్‌ రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దీనికి సంబంధించి అతడు 193 దేశాల్లో పేటెంట్‌ రైట్స్‌ తీసుకోవడం విశేషం.
సంచలనం సృష్టిస్తున్న క్విక్‌ యాడ్స్‌ యాప్‌ రూపకర్త సుమంత్‌

నల్లగొండ జిల్లా చర్లపల్లి సమీపంలో గల సాయిసదన్‌ హోమ్స్‌లో నివాసముంటున్న రాగిమల్లారెడ్డి, విమల దంపతులకు కుమారుడు సుమంత్‌రెడ్డి. తండ్రి మల్లారెడ్డి డైట్‌ కళాశాల లెక్చరర్‌.సుమంత్‌ విద్యాభ్యాసం 10వ తరగతి వరకు జిల్లాకేంద్రంలోనే జరిగింది. తదనంతరం ఇంటర్మీడియెట్‌ హైదరాబాద్‌లో, ఇంజనీరింగ్‌లో డ్యూయెల్‌ డిగ్రీని గీతం యూనివర్సిటీలో పూర్తి చేశాడు. ఇంజనీరింగ్‌ అనంతరం మొదట్లో జీఎస్టీపై సాఫ్ట్‌వేర్‌ను రూపొందించి తదనంతరం క్విక్‌ యాడ్స్‌ యాప్‌ను రూపకల్పన చేసి క్విక్‌ సిస్టమ్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట హైదరాబాద్‌ లో సంస్థను ఏర్పాటు చేసి ఆ సంస్థ డైరెక్టర్‌గా, సీఈఓగా కొనసాగుతున్నాడు.

193 దేశాల్లో పేటెంట్‌ హక్కులు పొందిన సంస్థ ..

యాప్‌ ఉపయోగించటం ఇలా..
ఏ నెట్‌వర్క్‌కు సంబంధించిన వినియోగదారుడైనా స రే.. తమ చేతిలోని ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో ఈ యాప్‌ను ఉపయోగించుకునే అవకాశముంది. వినియోగదారుడు తమ సెల్‌ఫోన్‌లోని ప్లే స్టోర్‌ ద్వారా ‘క్విక్‌ యా డ్స్‌’ అనే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులో తమ పేరు, వయసు, చిరునామా తదిత ర అంశాలు చేర్చా లి. తదనంతరం వినియోగదారుడు తనకొ చ్చే ఇన్‌కమింగ్‌, ఔట్‌గోయింగ్‌ కాల్స్‌ అనంతరం సెల్‌ఫోన్‌ కు 10నుంచి 30సెకన్ల నిడివి గల ఓ ప్రైవేట్‌ సంస్థకు చెందిన యాడ్‌ వస్తుంది. వినియోగదారుడు ఆ యాడ్‌ను వీక్షించిన అనంతరం 30సెకండ్ల నిడివి గల యాడ్‌కు 50 పైసలు యాడ్‌ అవుతాయి. ఇలా ఓ వినియోగదారుడు రోజుకు 10నుంచి 12కాల్స్‌ వరకు డబ్బులు పొందే అవకాశముంది. యాడ్స్‌ను వీక్షించటం ద్వారా నెలకు రూ.150 నుంచి రూ.200వరకు యూజర్‌ ఈజీగా డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ మొత్తాన్ని యూజర్‌ సెల్‌ఫోన్‌తో యూజర్‌ రీఛార్జి గాని, పేటీఎంగా గాని వాడుకోవచ్చు.యూజర్స్‌ వివరాలన్నీ గోప్యంగా..
క్విక్‌ యాడ్స్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న ప్రతి వినియోగదారుడి వివరాలు యాప్‌ రూపకర్త సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తమై ఉంటాయి. ఓ వినియోగదారుడు రోజుకు ఎన్ని కాల్స్‌ ద్వారా డబ్బులు యాడ్‌ చేసుకున్నాడో తెలుసుకునే అవకాశం అడ్మిన్‌కు ఉంది. ఇదే క్రమంలో కొందరు డబ్బుల సంపాద నకు పదే పదే ఒకే నంబర్‌కు కాల్‌ చేస్తే దాన్ని గమనించి 24గంటల పాటు వారికి ఈజీ మనీ ఎర్నింగ్‌ను నిలిపివేస్తారు. తదనంతరం యాప్‌ను పునరుద్ధరిస్తారు. కాలర్‌ వివరాలన్నింటినీ గోప్యంగా ఉంచడమే గాక ఎవరికీ వివరాలు తెలియజేయరు. ఈ యాప్‌కు సంబంధించి క్విక్‌ సిస్టమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఇప్పటికే 193దేశాల్లో పేటెంట్‌ పొందింది.