శుక్రవారం 15 ఫిబ్రవరి 2019 రాశి ఫలాలు

382
horoscope-details

మేష రాశి
ఈ రోజు ప్రయాణం చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేసే అవకాశముంది. ఆవేశానికి లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దాని కారణంగా తర్వాత బాధ పడాల్సి వస్తుంది. ఆర్థికంగా బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. మీ జీవితభాగస్వామికి సం బంధించిన విషయంలో ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు.

వృషభ రాశి
ఈ రోజు ఆర్థికంగా అనుకూలించే దినం. రావలసిన డబ్బులు తిరిగి రావటమే కాకుండా, పెట్టుబడుల నుంచి మంచి ధనాదాయం వస్తుంది. వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాదాలు సమసి పోతాయి. వృత్తిలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు.

మిథున రాశి
ఈ రోజు కొత్త వారితో పరిచయం కానీ లేదా విదేశీ యానానికి సంబంధించి ముఖ్య సమాచారం కానీ అందుకుంటారు. మానసికంగా కొంత ఆందోళనకు గురవుతారు. ఏదో తెలియని భయాన్ని అనుభవిస్తారు. మీ తండ్రిగారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఊహించని ఖర్చులు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.




 

కర్కాటక రాశి
ఈ రోజు ప్రతి పనిలో, రోజువారి జీవితంలో ఏదో ఒక ఇబ్బందిని, అడ్డంకులను ఎదుర్కొంటారు. గొడవలు, అవమానానికి గురవటం లేదా వివాదాల్లో ఇరుక్కోవటం జరగవచ్చు. ఇతరుల వ్యవహారాల్లో కల్పించుకోకండి. మానసిక స్థైర్యాన్ని కోల్పోకుండా పనులు చేస్తే విజయం వరిస్తుంది. పెట్టుబడులకు అనుకూలం కాదు. ఖర్చులు అధికంగా ఉంటాయి.

సింహ రాశి
ఈ రోజు మీ మిత్రులను కలుసుకుంటారు. అలాగే ప్రయాణం లో అనుకోని లాభం కలుగుతుంది. బంధువులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మంచి రుచికరమైన ఆహారం స్వీకరిస్తారు. ధనలాభం ఉం టుంది. పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో అనుకూల ఫలితం పొందుతారు. ఉద్యోగ విషయంలో సామాన్యదినం.

కన్య రాశి
ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

తుల రాశి
ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్యకొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి.

వృశ్చిక రాశి
ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

ధనుస్సు రాశి
ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.



మకర రాశి
ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్ఫుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాటతీరు కానీ, వ్యవహార శైలికానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. వివాదాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగంలో అనుకోని మార్పులు చోటు చేసుకోవచ్చు.

కుంభ రాశి
ఈ రోజు మీ స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. శారీరకం గా, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. మీ జీవితభాగస్వామి మీకు అనుకోని బహుమతి అందించే అవకాశ మున్నది. ఉద్యోగ విషయంలో సామాన్యదినం. ఎక్కువసేపు ఇంటిలో ఉండాలని, కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. ఆర్థిక విషయాలు పెద్దగా అనుకూలించవు.

మీన రాశి
ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బుకానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేప్పుడు కూడా జాగ్రత్త అవసరం.