మళ్ళి కత్తి మహేష్ కు పవన్ ఫ్యాన్స్ వార్నింగ్

250

కత్తి మహేష్… పవన్ కళ్యాణ్ ల మధ్య జరుగుతున్న వార్ కొనసాగుతూనే ఉంది. డైరెక్ట్ , ఇన్ డైరెక్ట్ పంచ్ లు వేసుకుంటూనే ఉన్నారు. తన సొంత పార్టీలో సీట్ కు తానే అప్లికేషన్ పెట్టుకున్న జనసేన అధినేత పవన్ ప్రజల చెవిలో పువ్వులు కాయిస్తున్నడు అని ట్వీట్ చేశాడు. తన పార్టీ గుర్తులాగే తను కూడా పారదర్శకతకు పెట్టింది పేరు అని తానే స్వయంగా చెప్పుకుంటున్న పవన్ నిజంగా చాలా గ్రేట్ అని మెచ్చుకుంటూనే విమర్శనాస్త్రాలు సంధించారు కత్తి. పవన్ లా సొంత కితాబు ఇచ్చుకునే లాంటి నేతలను నమ్మి మోసపోవద్దు అంటూ కత్తి చేసిన కామెంట్స్ కు జనసేన శ్రేణులు, పవన్ అభిమానులు కత్తి మహేష్ కు వార్నింగ్ ఇస్తున్నారు. నీ కత్తికి తుప్పు పట్టింది… అందుకే పిచ్చి రాతలు రాస్తున్నవ్ అని … ఇలాంటి రాతలు మానుకోవాలని హెచ్చరిస్తున్నారు.