ఫ్యాన్స్ మధ్య చిచ్చు పెట్టిన నవీన్ చంద్ర

318
hero heroine movie

నవీన్ చంద్ర హీరోగా నటిస్తున్న హీరో హీరోయిన్ టీజర్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టేలా ఉంది. పైరసీ నేపథ్యంలో వస్తున్న ఈ సినమాలో పైరసీ కింగ్ గా కనిపించనున్నాడు హీరో. అయితే టీజర్ ప్రారంభంలో వచ్చే డైలాగ్స్ .. ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయ్.
 

ఎన్టీఆర్, చరణ్ ఫ్యాన్స్ మధ్య ఘర్షణలకు దారి తీసేలా ఉన్నాయ్. మా ఎన్టీఆర్ సినిమానే నిలదీస్తావా అన్న ఎన్టీఆర్ అభిమానులను … మీ హీరో ఏంటి..? వచ్చే వారం రామ్ చరణ్ సినిమా రిలీజ్ అవుతుంది .. దాన్ని కూడా పైరసీ చేస్తానని చెబుతాడు హీరో. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హీరోకి సిగరెట్ వెలిగించి మరీ సపోర్ట్ చేస్తారు. అయితే ఇలాంటి సీన్ ను సినిమాలో పెట్టడంపై మండిపడుతున్నారు ఫ్యాన్స్.

కాగా… దీనిపై నవీన్ చంద్రా ఆన్సర్ ఇచ్చాడు. సినిమాలో తప్పేమీ చూపించలేదన్నారు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇదే నిజమని చెబుతున్నారు. యూట్యూబ్ లో ఓ హీరో ట్రయలర్ పై .. మరో హీరో ఫ్యాన్స్ ఇలాంటి కామెంట్సే చేస్తారని సమాధానం చెప్పాడు. బయట జరిగే సంఘటనలనే సినిమాలో చూపించామని.. దీనిపై క్లారిటీ ఇచ్చాడు.వరుణ్ తేజ్ తప్పుకున్న సినిమాలో రామ్… ఎందుకో తెలుసా?