కమల్ హీరోగా భారతీయుడు 2 .. విలన్ ఎవరంటే

409
kamal hasan

అప్పుడెప్పుడో విలక్షణ నటుడు కమల్ హాసన్…స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో ఓ సినిమా వచ్చింది. అదే భారతీయుడు. ఈ సినిమా సృష్టించిన రికార్డులు మామూలివి కాదు… అన్ని రికార్డులు బద్దలు కొడుతూ సంచలన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత దీనికి సీక్వెల్ తీయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని వార్తలు వచ్చిన అవేవీ నిజం కాలేక పోయాయి.




 

ఇన్ని సంవత్సరాల తర్వాత భారతీయుడు చిత్రానికి పార్ట్ 2 రాబోతుంది అంటూ మళ్ళీ ప్రచారం స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రచారం ఈ సారి నిజం అయింది. శంకర్,కమల్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ ముహూర్తం ఫిక్స్ చేసుకొని షూటింగ్ కూడా స్టార్ట్ చేసారు. అయితే కమల్ నటన గురించి మనకి తెలిసిందే ఏ పాత్రలోనైన జీవించేస్తాడు.

భారతీయుడు 2లో కమల్ కి ఢీకొట్టే విలన్ పాత్ర కోసం శంకర్ ఎవరిని ఎంపిక చేస్తాడబ్బా అనే ప్రశ్న అందరిలో మొదలైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించి కమల్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన శంకర్… విలన్ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాడట.



మరి ఈ చిత్రం లో విలన్ క్యారెక్టర్ చేయబోతుంది ఎవరో తెలుసా… హీరో సిద్దార్థ్. కమల్ సేతుపతి గా కనిపిస్తే…సిద్దార్థ్ విలన్ గా కమల్ ని ఢీకొట్టబోతున్నాడట. ఈ పాత్రకు సంబంధించిన మేకప్ టెస్ట్ లు పూర్తి కాగా… ఈ పాత్ర చూడటానికి చాలా విలక్షణంగా ఉండబోతుందట. కాగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది.

 

వరుణ్ తేజ్ తప్పుకున్న సినిమాలో రామ్… ఎందుకో తెలుసా?