‘సూర్యకాంతం’ మరో ట్రైలర్ విడుదల

349
niharika

వ‌రుణ్ తేజ్ స‌మ‌ర్ప‌ణ‌లో నిర్వాణ సినిమాస్ బ్యాన‌ర్‌పై నిహారిక, రాహుల్ విజ‌య్ జంట‌గా న‌టించిన చిత్రం `సూర్య‌కాంతం`. ప్ర‌ణీత్ బ్ర‌హ్మాండ‌ప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజ‌న్ ఎర‌బోలు, రామ్ న‌రేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్, పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాయి. నిహారిక కెరీర్‌ని ఈ సినిమా మలుపు తిప్పుతుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు.

 

1 నిమిషం 50 సెకన్ల నిడివితో ఉన్న ఈ ట్రైలర్‌లో ఆసక్తికర సన్నివేశాలు చూపించారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఈ సినిమా ట్రైయాంగిల్ లవ్ స్టోరీ అని తెలుస్తోంది. చిత్రానికి నిహారిక క్యారెక్టర్ హైలెట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. కాగా, ఈ సినిమా మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.