నేను చెప్పేది మీరంతా నమ్మాలి: సమంత

378
I believe you all

తాను చెబుతున్న విషయాన్ని అందరూ నమ్మాలని అంటోంది సమంత. ఇంతకీ విషయం ఏంటంటారా? అబ్బాయిలు తమ అమ్మలాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటుంటారన్న మాట విన్నారుగా? ఇది తన విషయంలో నిజమైందట. ఎలానో స్వయంగా చెబుతోంది సమంత.

దానికి సాక్ష్యంగా ఓ ఫోటోను కూడా తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఈ చిత్రంలో నాగచైతన్య తన తల్లి లక్ష్మి, భార్య సమంతల మధ్య కూర్చున్నాడు. విశేషం ఏంటంటే, సమంత, లక్ష్మిలు ఒకే డిజైన్, ఒకే కలర్ ఉన్న దుస్తులను ధరించివుండటమే. అయితే, ఇలా ఒకే డ్రస్ వేసుకోవాలన్న విషయాన్ని సమంత ఏమీ ముందుగా ప్లాన్ చేయలేదట.

ఒక రోజంతా తన అత్తయ్యతో సంతోషంగా గడిపానని, ఇద్దరం ముందుగా ప్లాన్ చేసుకోకుండా ఒకే రకమైన డ్రస్ వేసుకుని బయటకు వచ్చామని, దీన్ని అందరూ నమ్మాలని చెప్పింది. అమ్మలాంటి భార్య కావాలని అబ్బాయిలు అనుకుంటారని, తమ విషయంలో అది నిజమైందని ఆనందంగా చెప్పింది. కాగా, ఈ చిత్రం ఇటీవల వెంకటేశ్ కుమార్త అశ్రిత వివాహం సందర్భంగా తీసినట్టు తెలుస్తోంది.